ఏపీ ఎస్సి, ఎస్టి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులుగా రామ్మూర్తి
ప్రజాశక్తి-పాకాల: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులుగా కె రామ్మూర్తి ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఏకగ్రీవం గా ఎన్నికైన రామ్మూర్తిని మండల కమిటీ ఆధ్వర్యంలో మండల విద్యాధిóకారి కె బాబ్జీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సమస్యల పట్ల అతనికున్న పోరాట పటిమను కొనియాడారు. భవిష్యత్లో ఉన్నత శిఖరాలను అధరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామయ్య, ప్రభు, వెంకటస్వామి, యువరాజు, చంద్రశేఖర్, వెంకట రత్నం, సీనియర్ సిటజన్స్ వెంకటస్వామి, మునిరత్నం పాల్గొన్నారు.