70 కోట్ల నిధులతో అభివృద్ధి

Nov 18,2023 16:56 #Tirupati district

ప్రజాశక్తి-పాకాల : చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల మండలానికి 70 కోట్ల నిధులు విడుదల చేసి మండలంలోని ప్రతి పంచాయతీకి రెండు నుంచి మూడు కోట్లు నిధులు విడుదల చేసి అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదేనని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు.స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ లోకనాథం అధ్యక్షతనలో శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో నాకు ఇష్టమైన మండలాలు తిరుపతి రూరల్ మరియు పాకాల మండలం అని పాకాల మండలానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు.రాజకీయంలో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టినప్పుడు నా మొదటి ప్రచారం పాకాల నుంచి ప్రారంభం అయిందని అన్నారు.ప్రచారంలో పాకాల మండల ప్రజలు వారి కుటుంబ సభ్యుడిగా నన్ను ఎంతగానో ఆదరించారని అన్నారు. అలాంటి ఆదరణ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోనని,అందుకే పాకాల మండలానికి రుణం తీర్చుకోవాలని ఎల్లప్పుడూ పాకాల మండలం గురించి ఆలోచన చేస్తూ ఉంటానని అన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని రీతిగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనిని గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు. మండలంలో ప్రతి పంచాయతీలో సచివాలయం కానీ,ఆర్ బి కే కానీ ఇలాగా ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు. అధికార పార్టీ ఎప్పుడూ కూడా గడపగడపకు వెళ్లే దానికి ఆలోచిస్తారని, కానీ నేను గడపగడపకు వెళ్ళినప్పుడు అపూర్వ స్పందన లభించిందని అన్నారు. దీన్ని బట్టి చూస్తే మండలంలో మనం చేసిన అభివృద్ధి ఇంకొకసారి అధికారంలోకి తీసుకుని రావడానికి అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రతి కుటుంబానికి మధ్యవర్తులు లేకుండా లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు, కొన్ని కొన్ని కుటుంబాలకు మూడు లక్షల రూపాయల వరకు 15 రకాల సంక్షేమ పథకాలు అందాయని ఈ ఘనత వైఎస్ఆర్సిపి ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రజా ప్రతినిధులుగా మనము ఎప్పుడూ ప్రజలతో కలిసి ఒక కుటుంబ సభ్యులుగా భావించి పెళ్లి వచ్చినప్పుడు పెళ్లి కానుకలు, పండుగలు వచ్చినప్పుడు కానుకలు, కరోనా సమయంలో మండలంలోని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వారికి మెడిసిన్స్,పళ్ళు, కాయగూరలు, బియ్యం, ప్రొవిజన్స్ ఇవన్నీ అందించడం జరిగిందని అన్నారు.ఏ కుటుంబంలో అయినా ఒక ఆపద వస్తే మేమున్నామంటూ ఆ కుటుంబాన్ని ఆదరించామని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసిన మంచి పనులను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. నాలుగు సంవత్సరాలుగా కనబడని ప్రతిపక్షాలు అన్నీ ఇప్పుడు వచ్చి మేము ఏదో చేస్తామని అంటున్నారని, కానీ మండలంలోని ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని తొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నవారికి ప్లస్లు మైనస్లు ఉంటాయని,వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే మేము గడపగడపకు తిరిగి ఉండేవాళ్ళముక్కామని అన్నారు. ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి గడపగడపకు వెళ్లేలా చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి,సింగల్ విండో చైర్మన్ మునీశ్వర్ రెడ్డి,ఏఎంసీ చైర్మన్ లింగయ్య,ఎంపీపీ లోకనాథం, తాసిల్దార్ భాగ్యలక్ష్మి మరియు ప్రజా ప్రతినిధులు మండల అధికారులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️