జగన్‌తోనే సంక్షేమం సాధ్యం

పూసపాటిరేగ : ముఖ్యమంత్రి జగన్‌తోనే ప్రజా సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. శుక్రవారం మండలంలోని చింతపల్లి-1 సచివాలయ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల కాలంలో అందించిన సంక్షేమ పథకాలతోపాటు ప్రభుత్వం వచ్చాక కలిగే మేలును వారికి వివరించారు. ప్రభుత్వ పనితీరు గురించి ప్రజలనడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో జగనన్నను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గడిచిన నాలుగేళ్ల కాలంలో కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ మహంతి శ్రీనివాసరావు, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు బర్రి చిన్నప్పన్న, వైస్‌ ఎంపిపిలు ఎన్‌.సత్యనారాయణరాజు, అల్లాడ రమేష్‌, మహంతి జనార్దనరావు, సర్పంచ్‌ బర్రి ముసలి పాల్గొన్నారు. వేపాడ : మండలంలో ఆతవ గ్రామంలో జగనే ముఖ్యమంత్రిగా ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి డి.సత్యవంతుడు మాట్లాడారు. అనంతరం సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ వి.వి.చినరాము నాయుడు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎన్‌.వెంకట్రావు, సర్పంచ్‌ గొంప వేమన రామునాయుడు, ఇఒపిఆర్‌డి ఉమ, స్వచ్ఛభారత్‌ కోఆర్డినేటర్‌ గొర్రె రాంబాబు, పంచాయతీ కార్యదర్శి నానిబాబు, నాయకులు పాల్గొన్నారు.బొండపల్లి : పేదల సంక్షేమం కోసం వైసిపి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఎంపిపి చల్ల చలంనాయుడు తెలిపారు. శుక్రవారం మండలంలోని బి.రాజేరు పంచాయతీ ఆవరణలో ఎంపిడిఒ వైవి.రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షతన ఆంధ్రాకు జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు బొద్దల చిన్నంనాయుడు, గొట్లాం పిఎసిఎస్‌ అధ్యక్షులు మహంతి రమణ, సర్పంచ్‌ ఈదుబిల్లి కృష్ణ, ఇఒపిఆర్‌డి సిహెచ్‌.సుగుణాకరరావు, ఎఒ మల్లికార్జునరావు, హౌసింగ్‌ ఎఇ బివి.రామరాజు, రాచకిండాం పిఎసిఎస్‌ అధ్యక్షులు గొల్లు సతీష్‌, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ పల్లి రఘు, ఎంపిటిసి సభ్యులు తాళ్లపూడి అప్పలనాయుడు, వైస్‌ సర్పంచ్‌ లచ్చిరెడ్డి జోగారావు, తదితరులు పాల్గొన్నారు.

➡️