ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : కాతేరు గ్రామపంచాయతీ సచివాలయం-3, సచివాలయం-4, సచివాలయ-5లో గురువారం నూతనంగా నిర్మితమైన సచివాలయం, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా చందన నాగేశ్వర్ మాట్లాడుతూ అభివృద్ధి అనేది గ్రామ స్థాయి నుండి ఉండాలని అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. పరిపాలన అనేది ఎప్పుడు ఒకచోటే కేంద్రీకృతం కాకూడదని అందరికి అందుబాటులో ఉండాలని జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయం వ్యవస్థను ప్రారంభించడం జరిగిందన్నారు. అదే విధంగా ప్రజలకి వైద్యం కూడా అందించాలని విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం చేయడం జరిగిందని ఏ ఒక్కరూ అనారోగ్యంతో ఉండకూడదనే లక్ష్యంతో సీఎం జగన్ అన్ని విధాలైన చర్యలు తీసుకుంటున్నారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చందన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం-4వైయస్సార్సీపి పార్టీ సీనియర్ నాయకులు ఆచంట సుబ్బారాయుడు, కన్వీనర్ -1 ఆచంటకళ్యాణ్ , కన్వీనర్-5 యెజ్జు వాసు, మద్ద దుర్గారావు, మానుకొండ వెంకట్రావు, గంగిపముల సురేష్, ఈతకోటి విజయ్, పెనుమాక సునీల్, ఈనపాల కృష్ణంరాజు, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.