ప్రజాశక్తి – చింతలపూడి
ద్విచక్రవాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరలించాలని చింతలపూడి సిఐ మల్లేశ్వరరావు అన్నారు. పట్టణంలో పోలీస్ అధికారులు, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం సంయు క్తంగా గురువారం హెల్మెట్‌పై అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ మల్లేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ ప్రమాదాల వల్ల జరిగే నష్టం ఒక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌కి సమానమన్నారు. ప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యమన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపటం, ఆటోల్లో పరిమితికి మించి జనాలను తరలించడం, అతివేగం, సీట్ బెల్ట్ లేకుండా నడపడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలందరూ భద్రత ప్రమాణాలు పాటించి, తమకు నష్టం జరగకుండా, ఎదుటివారు కూడా నష్టపోకుండా, హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎస్‌ఐ ప్రసాద్, శ్రీ చైతన్య ప్రిన్సిపల్ సురేష్, డి.మధు, సిబ్బంది పాల్గొన్నారు.