ప్రజాశక్తి – ముసునూరు
సిఎం జగన్ గ్రామాల్లో సచివాలయం వ్యవస్థ ద్వారా అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని జెడ్‌పిటిసి సభ్యులు డాక్టర్ ప్రతాప్, వైస్ ఎంపిపి కోటగిరి రాజానాయన తెలిపారు. మండలంలోని ముసునూరు గ్రామ సచివాలయంలో ఎంపిడిఒ జి.రాణి ఆధ్వర్యంలో పల్లెకుపోదాం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపిపి కోటగిరి రాజానాయన మాట్లా డుతూ ముసునూరు గ్రామానికి రూ.17,77,59,843 సంక్షే మం, నూతన భవనాల నిర్మాణానికి నిధులు మం జూరు చేసి అభివృద్ధి చేశారన్నారు. జెడ్‌పిటిసి సభ్యులు ప్రతాప్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నేరవేర్చలేని హామీలు, ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకె ళ్లాలని వాలంటీర్లను కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండలాధ్యక్షులు మూల్పురి నాగవల్లేశ్వరరావు, రేగుల గోపాలకృష్ణ, తులిమెల్లి రంగరావు, ఇఒపిఆర్‌డి బసవ రాజు, అచ్యుత సత్యనారాయణ, ఎంపిడిఒ సూపరిం టెండెంట్ కూచిపూడి సాయిరామ్, సీనియర్ అసిస్టెంట్ ఎస్.శ్రీని వాసరావు, జూనియర్ అసిస్టెంట్ సన్నీరాజన్ పాల్గొన్నారు.టి.నరసాపురం : మండలంలోని బొర్రంపాలెంలో సచివాలయం-1 పరిధిలో ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జెడ్‌పిటిసి సభ్యులు సామంతపూడి బాల సూర్యనారా యణరాజు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో సచివాలయం ద్వారా వాలంటీర్లు నేరుగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. బొర్రంపాలెంలో సచివాలయం-1 పరిధిలో రూ.24 కోట్లు లబ్ధిదారులకు నేరుగా ఖాతాలో సిఎం జగన్ జమ చేశారన్నారు. బొర్రంపాలెంలో రోడ్డు, డ్రెయినేజీల వ్యవస్థ వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతే త్వరతగతిన పూర్తవుతున్నాయని తెలిపారు. అనంతరం పల్లెకు పోదాం కార్యక్రమంలో ప్రతి ఇంటి గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీనురాజు, మాజీ ఎంపిపి కొత్త ప్రకాష్, సర్పంచి కె.వెంకటేశ్వరమ్మ, పడాల సత్యనారాయణ పాల్గొన్నారు.