ప్రజాశక్తి-పాకాల : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 40 మంది విద్యార్థులు రక్తదానం చేసినట్లు కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సిసి విభాగం ఆధ్వర్యంలో ఎన్సిసి దినోత్సవం సందర్భంగా రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. చిత్తూరు రెడ్ క్రాస్ సంస్థకు ఎన్సిసి క్యాడేట్లు రక్తదానం చేశారని అన్నారు.ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అన్నారు. ఎన్సిసి ఆఫీసర్ డాక్టర్ ఈశ్వర్ బాబు మాట్లాడుతూ కోర్టు ఖర్చు చేసిన కాపాడలేని ప్రాణాలను రక్తదానం ద్వారా కాపాడవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మాశిలమని, చిట్టి కళావతి, ఆది శేఖర్ రెడ్డి, రమణమ్మ, రెడ్ క్రాస్ సిబ్బంది క్యాడేట్లు విద్యార్థులు పాల్గొన్నారు.