దళితులపై దాడులను ఖండించాలి

Nov 18,2023 23:57 #Tirupati district

 

దళితులపై దాడులను ఖండించాలి

ప్రజాశక్తి -కోట : గోదావరి జిల్లాలో దళితుడైన బొంతా మహేంద్ర పై జరిగిన దారుణమైన సంఘటన వైసిపి అరాచక పాలనకు నిదర్శనమని కాంగ్రెస్‌ మండల అధ్యక్షురాలు కర్లపూడి సుధా అన్నారు. శనివారం కోట మండలంలోని తహశీల్దారు కార్యాలయం వద్ద వారు మాట్లాడుతూ బోంతా మహేంద్ర కు జరిగిన అన్యా యంపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు స్పందిం చాయని, ఇందులో భాగంగా ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఆదేశాల మేరకు కర్లపూడి సుధా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంతే కాకుండా రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు ప్రతి చోటా జరుగుతూనే ఉన్నాయన్నారు. దళితులపై అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని, ఇందుకు గతంలో జరిగిన డాక్టర్‌ సుధాకర్‌ మరణానికి ప్రభుత్వ వేధింపులే సాక్ష్యం అని గుర్తు చేశారు. గత నాలుగున్నర సంవత్సరాలలో దళితులకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమి లేదని అంతా శూన్యం అన్నారు. దళిత విద్యార్థులకు అందాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ల ద్వారా దళిత గిరిజన నిరుద్యోగులకు అందాల్సిన సాయం వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. దళితులకు నిర్మించవలసిన ఇళ్లు ఆనవాళ్లే లేకుండా చేశారని అన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో దళితులకు ఇచ్చిన అసైన్డ్‌ భూము లను ఈ వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా స్వాధీనం చేసుకోవడం దుర్మార్గం అని ఫలితంగా ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంద న్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆనాడు దళితులకు ఇచ్చిన భూములను వెంటనే తిరిగి దళితులకు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్త లు పాల్గొన్నారు.
వెంకటగిరి: వైసిపి ప్రభుత్వం సామాజిక బస్సు యాత్ర ఎందుకు చేస్తోందని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు పంట శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. వెంకటగిరిలో దళితులపై దాడికి నిరసనగా ర్యాలీ లో పాల్గొని ఈ ప్రభుత్వాన్ని మీడియా ముఖంగా ప్రశ్నించారు. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా గడిచిన నాలుగు సంవత్సరాలు ఏడు నెలలు ఏం సాధించారని దళితులపై దాడిలు తప్ప అని నిలదీశారు. నాడు డాక్టర్‌ సుధాకర్‌ నుండి ఇప్పటి బొంతు మహేంద్ర వరకు దళిత యువకులను దళితులను వేధించి చంపడమే వారు చేస్తున్న సామాజిక బస్సు యాత్రకు నిదర్శమని పంట దళితులపై దాడిని ఖండించాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారు ఆర్థిక అభివద్ధికి కషి చేస్తే నేడు ఆ కార్పొరేషన్లను ఇర్వీర్యం చేస్తున్నందుకు సామాజిక సామాజిక యాత్ర చేస్తున్నారా? అని ఎద్దేవా చేశారు. దళితులపై దాడులు హత్యలు ఆపాలని, హత్య రాజకీయాలకు స్వస్తి పలికి రాష్ట్ర అభివద్ధికి కషి చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్‌ నిధులను దారి మళ్లించకుండా ఆ నిధులతో ఆర్థికంగా బలపడేందుకు కషి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్‌ చెన్నయ్య, గూడూరు మండల కాంగ్రెస్‌ ప్రసిడెంట్‌ దర్శి నాగ భూషణం, వెంకటగిరి పట్టణ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ కలపాటి శ్రీనివాస్‌ కాల్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️