ప్రజాశక్తి-పెరవలి : స్థానిక పెరవలి ఐసిడిసి ప్రాజెక్టు కార్యాలయం వద్ద శనివారం ప్రాజెక్టు పరిధిలో ఉన్న మూడు మండలాలు పెరవలి ఉండ్రాజరం నిడదవోలు నిడదవోలు మున్సిపాలిటీ కు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని గ్రాట్యూటీ అమలు చేయాలని ఇతర సమస్యలు తక్షణం పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడి యూనియన్ నాయకురాలు సూర్యకాంతం మాట్లాడుతూ అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కనీస వేతనం పెన్షన్ ఈఎస్ఐ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనియన్ గౌరవాధ్యక్షులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్ను అధనంగా వేతనాలు పెంచాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నిలుపుకోలేదని ఆయన విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు వేతనంతో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితిని 50 సంవత్సరాలకు పెంచాలని ప్రమోషన్లలో రాజకీయ జోక్యం ఉండకూడదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడిల యూనియన్ నాయకులు కే .సూర్యకాంతం జే రత్నకుమారి ఎం. కన్యాకుమారి సిహెచ్. విశాలి ఎం. జానకి ఎస్ .రంగనాయకమ్మ యు. ధనలక్ష్మి ఎన్ .వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు.