సచివాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్
అనంతపురం : గ్రామ స్థాయిలో సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైసిపి ప్రభుత్వం దరిచేరుస్తోందని రాష్ట్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు. కూడేరు మండలం పి.నారాయణపురంలో విద్యుత్ సబ్ స్టేషన్, గ్రామ సచివాలయం, ఆర్‌బికె, వైస్సార్ హెల్త్ క్లీనిక్ నూతన భవనాలను సోమవారం నాడు జెడ్పీ ఛైర్‌పర్సన్ గిరిజమ్మ, మాజీ ఎమ్మెల్యే విశేశ్వరరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు మరిన్ని సబ్ స్టేషన్లు నిర్మిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్య, వైద్య, వ్యవసాయ, విద్యుత్ రంగాల్లో వినూత్న సంస్కరణలను తీసుకొచ్చి ఇటు సంక్షేమం, అటు అభివద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందన్నారు. రైతుల కోసం గ్రామస్థాయిలో ఆర్‌బికెలను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి, జడ్పిటిసీ అశ్విని, వైసిపి మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, సర్పంచి హనుమంతరెడ్డి, బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న, మండల అగ్రి అడ్వైజరీ బోర్డు ఛైర్మన్ నిర్మలమ్మ, జెసిఎస్ కన్వీనర్ దేవేంద్ర, సింగిల్ విండో ఛైర్మన్ గంగాధర్‌తో పాటు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.