ఓటింగ్‌ యంత్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఎం.గౌతిమి

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై ప్రతి ఒక్కరికీ విస్తతంగా అవగాహన

ఓటింగ్‌ యంత్రాలపై అవగాహన కల్పించాలి

    అనంతపురం కలెక్టరేట్‌ : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై ప్రతి ఒక్కరికీ విస్తతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఎం.గౌతమి ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్‌ కార్యాలయంలోని స్పందన కేంద్రం వద్ద ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల అవగాహన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నిరంతరాయంగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు ఎలా పని చేస్తాయో సవివరంగా వివరించాలన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా, వారికి అవగాహన కల్పించేలా ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను జిల్లాలోని అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు ఆర్డీవో కార్యాలయాలతో పాటు ఐదు నియోజకవర్గ కేంద్రాలలోని తాలూకా కార్యాలయాల్లో ఏర్పాటు చేశామన్నారు. ప్రజలంతా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై నిర్వహించే అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఓటు ఎలా వేయాలో తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, ఆర్డీవోలు గ్రంధి వెంకటేష్‌, సి.శ్రీనివాసులురెడ్డి, ఈఆర్‌ఒలు సుధారాణి, వెంకటేశ్వర్లు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ భాస్కర్‌, స్పందన తహశీల్దార్‌ మారుతి, డిప్యూటీ తహశీల్దార్‌ కనకరాజు, సీనియర్‌ అసిస్టెంట్‌ శామ్యూల్‌, ఎలక్షన్‌ డిటిలు పాల్గొన్నారు.సవివరంగా దరఖాస్తులను విచారణ చేసి పరిష్కరిస్తున్నాంవిజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి శుక్రవారం నాడు ఓటర్ల జాబితాపై రాష్ట్ర చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా వీడియో కాన్ఫిరెన్స్‌ నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లోకలెక్టర్‌ ఎం.గౌతమి, జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, డిఆర్‌ఒ గాయత్రీ దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఆర్‌-2024లో భాగంగా జిల్లాలో పెండింగ్‌ ఉన్న దరఖాస్తులను సవివరంగా విచారించి పరిష్కారం చేస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను అనుసరించి పెండింగ్‌ ఉన్న ఫామ్‌ 7 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. 18, 19 ఏళ్ల వయసున్న వారు సమర్పించిన దరఖాస్తులను పరిశీలన చేపడుతున్నామన్నారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులకు సంబంధించి అప్డేట్‌ ప్రక్రియ చేస్తున్నామన్నారు. జిల్లాలో సెక్టార్‌ ఆఫీసర్లు, సెక్టార్‌ పోలీస్‌ ఆఫీసర్లను నియమిస్తున్నట్లు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు గ్రంధి వెంకటేష్‌, సి.శ్రీనివాసులురెడ్డి, ఈఆర్‌ఒలు సుధారాణి, వెంకటేశ్వర్లు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ భాస్కర్‌, డిప్యూటీ తహశీల్దార్‌ కనకరాజు, సీనియర్‌ అసిస్టెంట్‌ శామ్యూల్‌, ఎలక్షన్‌ డిటిలు, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️