మహాసభలు జయప్రదం చేయండి

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

 

ప్రజాశక్తి-ఉరవకొండ

వచ్చేనెల 6, 7వ తేదీల్లో కళ్యాణదుర్గంలో నిర్వహించనున్న 31 జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి సిద్ధార్థ పిలుపునిచ్చారు. ఈమేరకు శుక్రవారం పట్టణంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా జిల్లావ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా అనేక కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్నాయన్నారు. మరోవైపు ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే పిల్లలను పాఠశాలలు, కళాశాలల్లోకి పాఠశాలలో అనుమతిస్తామని తల్లిదండ్రులపై మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు ప్రభుత్వమే ఫీజు భరించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు రూ.10వేలు ప్రత్యేక స్కాలరిషిప్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సౌకర్యాలైన మంచినీరు, మురుగుదొడ్లు కల్పించాలని, మెనూ ప్రకారం భోజనం ఏర్పాటు చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్‌, కాస్మోటిక్‌ ఛార్జీలు పెంచాలన్నారు. అదేవిధంగా జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన కోసం జాయింట్‌ అకౌంట్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. డిగ్రీ విద్యార్థులకు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వసతిదీవెన, విద్యాదీవెన సొమ్మును విడుదల చేయాలన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి జిల్లాలో ఉన్న విద్యార్థులను చైతన్య పరచడం కోసం ఈనెల 31న మేథావులు, విద్యావేత్తలు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు, కార్యదర్శులు హిరణ్య, నందు, సతీష్‌, వేణు, అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️