జెఎన్‌టియు విద్యార్థినికి బాల గణపతి నాట్య నందీశ్వర అవార్డు

జెఎన్‌టియు విద్యార్థినిని అభినందిస్తున్న విసి రంగజనార్ధన

 

ప్రజాశక్తి-అనంతపురం

స్థానిక జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎంటెక్‌ చదువుతున్న డి.రామలాలిత్యకు బాల గణపతి నాట్య నందీశ్వర అవార్డు వచ్చింది. చిత్తూరు జిల్లా కాణిపాకం వరశిద్ధి వినాయక ఆలయ ఆస్థాన మంటపంలో నిర్వహించిన 8వ జాతీయ నందీ పురస్కార ఉత్సవాల్లో బాల గణపతి నాట్య నందీశ్వర పురస్కార అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఉపకులపతి రంగజనార్ధన మాట్లాడుతూ శ్రీసాయి నాట్యాంజలి పైన్‌ ఆర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ ఇన్‌ అసోసియేషన్‌ విత్‌ మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్‌, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లాంగ్యేజ్‌ అండ్‌ కల్చర్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 8వ జాతీయ నంది పురస్కార ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్సు విభాగం మొదటి సంవత్సరం చదువుతున్న డి.రామలాలిత్య బాల గణపతి నాట్య నందీశ్వర అవార్డును కైవసం చేసుకున్నట్లు తెలిపారు. విద్యార్థినిని విసితోపాటు రెక్టార్‌ ఎం.విజయకుమార్‌, రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌, కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌.వి.సత్య నారాయణ, వైస్‌ ప్రిన్సిపల్‌ ఇ.అరుణకాంతి, సీఎస్‌ఈ విభాగాధిపతి కె.ఎఫ్‌.భారతి, సీఎస్‌ఈ విభాగం ఆచార్యులు అభినందనలు తెలిపారు.

➡️