విసి సుధాకర్‌కు బొకే అందజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నేతలు
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా చింతా సుధాకర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్ మాట్లాడుతూ ఎస్‌కెయులో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించి విద్యార్థుల విద్యాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు గిరి, శివ, బీమేష్ తదితరులు పాల్గొన్నారు.