ఎంపిపికి వినతిపత్రం అందజేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
సిఐటియు యూనియన్ నాయకురాలు విజయ
ఉరవకొండ : అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు ఉరవకొండ ప్రాజెక్ట్ యూనియన్ నాయకురాలు విజయ డిమాండ్ చేశారు. ఈమేరకు విడపనకల్ మండలం ఎంపీపీ కరణం పుష్పావతి భీమ్‌రెడ్డిని గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీలకు ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలు చెల్లిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇందుకు ఎంపిపి స్పందిస్తూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వ్వాడీ యూనియన్ సంఘం నాయకులు జె.రాజమ్మ, జె.నిర్మాలాదేవి, వాణితాదేవి, భారతిదేవి, లక్ష్మి, గాయిత్రీదేవి, హేమలత, తదితరులు పాల్గొన్నారు.