27,28 న జరిగే కార్మిక, కర్షక మహా ధర్నాకు తరలిరండి

ప్రజాశక్తి – కొమరాడ : ఈనెల 27, 28న విజయవాడలో జింఖానా గ్రౌండ్స్‌ లో జరిగే కార్మిక కర్షక మహా ధర్నాకు కదలిరావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి వేణు పిలుపునిచ్చారు. ఆదివారం కొమరాడలో జరిగిన ప్రజాసంఘాల సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న బడా పెట్టుబడిదారి అనుకూల విధానాలతో కార్మిక, కర్షక, పేదలకు తీరని ద్రోహం జరిగిందన్నారు. మునిపెన్నడు లేని విధంగా నిరుద్యోగం, దారిద్య్రం పెరిగిపోతున్నదని, మరోవైపు దేశంలో దళిత, గిరిజన, మైనారిటీ, మహిళలపై విచ్చలవిడిగా దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కేంద్ర కార్మిక, రైతు సంఘాలు తలపెట్టి దేశవ్యాప్తంగా మహాధర్నాకు ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ నాయకులు కొల్లి సాంబమూర్తి, అంగనవాడి యూనియన్‌ నాయకులు అనురాధ, లలిత, ఎపి గిరిజన సంఘము నాయకులు వెంకటేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శివుని నాయుడు, మధ్యాహ్న భోజన మండల నాయకులు నిర్మలమ్మ, ఆశ వర్కర్ల మండల నాయకులు పార్వతి, సిహెచ్‌ డబ్ల్యు మండల నాయకులు మంగమ్మ పాల్గొన్నారు.పార్వతీపురంటౌన్‌ : స్థానిక స్వీపర వీధిలో సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ ఈనెల 27,28 మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. సిఐటియు నాయకులు బి.సూరిబాబు, మామిడి శివ, బంగారి కాశి, బంగారి రాజా, ఇసకపల్లి సోమేశ్వరరావు, మామిడి గౌరీశంకర్రావు, గంట్రెడ్డి చిన్నమ్మలు, పాలకొండ దుర్గ, మంగళగిరి ముత్యాలు, మంగళగిరి మంజు, తదితరులు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : ఈనెల 27,28 తేదీల్లో విజయవాడలోని జింఖానా మైదానంలో జరగబోయే కార్మిక, రైతు మహాధర్నా తరలిరావాలని మండలంలో ప్రచారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతుల సమస్యలను పరిష్కరించకుండా వివక్షత చూపుతున్నారని అన్నారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో కరువు తాండవిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టీ పట్టనట్లు వ్యవహరించడం తగదన్నారు. ప్రచార కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు బిడ్డిక ఆడిత్‌, బిడ్డిక రవణమ్మ, సాంబమూర్తి ఉన్నారు.

➡️