ప్రజాశక్తి – సీతంపేట : సీతంపేట ఏజెన్సీలో ప్రకృతి అందాలు పచ్చని పొలాలు తన ఒంపు సొంపులతో సోయగాలు కళ్లకు కనువిందు చేసేలా దర్శనమిస్తాయి. సీతంపేట అంటే ఠక్కున గుర్తొచ్చేది పర్యాటకం. పర్యాటకులు ప్రేమికులుగా సీతంపేట మారింది. ఎందుకంటే ఇక్కడ పర్యాటకం తెలంగాణ, ఒడిశా పరిచయం చేసుకుంది. ఎక్కడా లేని విధంగా పర్యాటక అభివృద్ధి చెందింది. ప్రతి ఏటా మూడు రాష్ట్రాల నుంచి లక్షా 50 వేల మంది పర్యాటకులు ఈ పార్కును సందర్శిస్తారు. జలపాతాలు ఒంపు సొంపులుగా కొండలు, వాహనాలపై వెళ్తుంటే కొండలు మన పక్కనుండే మనకన్నా ముందుగా వెళ్తున్నట్టు అనుభూతి కనిపిస్తుంది. మరోవైపు పచ్చని పొలాలతో కనువిందు చేస్తుంది.. కొండలపై జలపాతాలు పారుతుంటే వాటి సొగసులు కనిపిస్తాయి. ఇక కార్తీక మాసంలో పర్యాటకులకు సీతంపేట ఏజెన్సీ ఒక సందడిగా మారుతుంది. అయితే సీతంపేట ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ ఏర్పాటుచేసి ఐదేళ్లు కావస్తుంది. సుమారు మూడున్నర కోట్లు వ్యయంతో అభివృద్ధి చేశారు. ఈ పార్కులో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజారు చేయడానికి అవకాశం కల్పించారు. ఎన్టీఆర్ అడ్వెంచర్ (పార్కులో అందాలను చూద్దాం) పార్కులో జల విహార వద్ద పర్యాటకులు బోట్ షికారు చేస్తారు. మరోవైపు వాహనాలు పక్కనుండే రైరు రైరు మంటూ వాహనాలు వెళ్తుంటాయి. మనపై నుండి స్కై సైకిల్ ఆకాశంలో చక్కెర్లు కొడుతుంటారు. అదే జలవిహారు అడ్డంగా హ్యాంగింగ్ బ్రిడ్జిపై యువతీ యువకులు నీటి మీద నడక నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇదంతా జలవిహార్ మధ్యలోనే జరుగుతుంది. ఇది చూస్తేనే ఇంత అద్భుతంగా కనిపిస్తుంది. ఇక ఎంజారు చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. మరో ప్రక్క క్లైమ్బ్లింగ్ వాల్ యువకులు ఎక్కుతూ సాహసం చేస్తారు. మరికొంతమంది జెయింట్ విల్ లో ఉయ్యాల ఊగుతారు. వాటర్ రోల్‌లో జలవిహార్ వద్ద గుండ్రంగా తిరుగుతుంటే భూమి నీరు మన చుట్టూ మన వైపు తిరుగుతున్నట్లు నీటిమధ్యలో అనుభూతి వేరు. ఆల్ ట్రైన్‌లో పర్యాటకులు పార్క్‌ను చుట్టుముడతారు. ఇక చిన్నారులు కమాండ్ నెట్ మినీ ట్రైన్ వద్ద ఆడుకుంటారు. ఏడేళ్లలో పిల్లలకు మినీ ట్రైన్ చిన్నపిల్లల బోటింగ్లే తమాషాగా ఉంటుంది. పైవ్ డి థియేటర్ భయంకరమైన హర్రర్ పిక్చర్స్ డిజిటల్ సౌండ్‌తో యువకులు కేకలు చేస్తారు. కన్నులకు దగ్గరగా కనిపించే అబ్బురు పరిచే 3డి పెయింటింగ్స్ కనువిందు చేస్తాయి. యువతీ యువకులు ఆనంద విహార్ వద్ద ఉల్లాసంగా, ఉత్సాహంగా డాన్సులు చేస్తున్నారు. గిరి విహార వాహనంలో మెట్టుగూడ జలపాతాన్ని సందర్శించి అక్కడ అందమైన పగోడాలు కనవిందు చేస్తాయి. కొండలపై నుంచి జలపాతాలు జారుతుండడంతో జలపాతాల వద్ద జలకాలాడుతూ కేరింతలు కొడతారు. అదే వాహనంలో ఆడలి యు పాయింట్ చూస్తే హిరమండలం రిజర్వాయర్ కనిపిస్తుంది. ఎత్తయిన కొండలపై నుంచి పర్యాటక వాహనంలో ట్రావెలింగ్ చేస్తే ప్రకృతి సోయగాలు మన శరీరానికి తాకుతూ ఉంటాయి.పర్యాటకులకు సౌకర్యాలు కల్పిస్తున్నాంస్థానిక ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్‌కు వచ్చిన పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. తాగునీరు, మరుగుదొడ్లు, సేద తీర్చుకోవడానికి బెంచీలు ఏర్పాటు చేసాం. కొండలపై వెళ్లడానికి గిరి వాహనాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా తక్కువ ధరకే టికెట్ ఇస్తున్నాం.ఎస్ రాజు,మేనేజర్ ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్,సీతంపేట.