వేతన బకాయిలు చెల్లించాలి

 ప్రజాశక్తి-పాలకొండ  :  అంగన్వాడీల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు ఎన్‌.హిమప్రభ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం యూనియన్‌ విస్తృత స్థాయి సమావేశాన్ని ప్రాజెక్టు అధ్యక్షులు జి.జెస్సీబారు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీల మూడు నెలల వేతన బకాయిలు చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలో ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే కార్మిక, రైతు మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీతంపేట ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు బి.పార్వతి, ఎ.దర్శమ్మి, సెక్టార్‌ లీడర్లు కె.శారద, ఎం.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

➡️