ప్రజాశక్తి-పార్వతీపురం : సమాజాంలో లింగవివక్ష ఉండకూడదని, పూర్తిగా నిర్మూలించాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు కోరారు. మహళలపై గృహ హింసను నిరోధించుటకు గృహ హింస చట్టంపై అవగాహన కల్పిస్తూ పట్టణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో ఆర్‌సిఎం జిల్లా క్యార్యాలయ సముదాయం నుంచి చేపట్టిన ర్యాలీని జెసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో విజయం సాధిస్తున్నారని తెలిపారు. చట్టం పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు కల్పించిందని, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. ఇంటిలో, పనిప్రదేశాల్లో మహళలను గౌరవించాలని, వారి హక్కులను కాపాడాలని తెలిపారు. మహిళల హక్కులను కాపాడేందుకు రూపొందించిన గృహహింస చట్టాలపై ప్రతి మహిళా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ కిరణ్‌కుమార్, జిల్లా శిశు సంక్షేమ అధికారి కె.విజయగౌరి, మున్సిపల్ కమిషనరు రామప్పలనాయుడు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.గరుగుబిల్లి : మండల కేంద్రంలో గృహ హింస చట్టంపై అవగాహన ర్యాలీని వైకెపి, ఐసిడిఎస్ ఆధ్వర్యాన నిర్వహించారు. కార్యక్రమంలో తహశీల్దార్ జి.వెంకట జనార్ధన్, సర్పంచ్ కలిశెట్టి ఇందుమతి, ఎపిఎం పెదిరెడ్ల అప్ప నాయుడు, సిసిలు చందాన తిరుపతిరావు, బొంగు రామినాయుడు, కింజంగి కృష్ణ, వి.లక్ష్మణరావు, చింతాడ ప్రసాద్, కొప్పర రమేష్, తదితరులు పాల్గొన్నారు.సీతానగరం : ఎపిఎం ఆర్.శ్రీరాములనాయుడు ఆధ్వర్యంలో వైకెపి కార్యాలయం నుంచి హనుమాన్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిసిలు కోటేశ్వరరావు, ఆనందరావు, ప్రసాద్, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.కురుపాం : వైకెపి కార్యాలయం వద్ద మహిళా సంఘాల సభ్యులతో ఎపిఎం ఇవి కిశోర్ లింగవివక్షకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిసిలు శ్రీను, అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.కొమరాడ : వైకెపి కార్యాలయం నుంచి మండల కేంద్రం వరకు మహిళా హక్కులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎంపిడిఒ కార్యాలయ ఎఒ రమేష్, ఎపిఎం వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : గుమ్మలక్ష్మీపురం కెజిబివి విద్యార్థులు లింగవివక్షకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎపిఎం ఆదయ్య, ప్రిన్సిపల్ శ్రీరంజని, సిసిలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. వీరఘట్టం : మహిళలపై దాడులు ఆపాలని మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి డి.వెంకటరమణ నాయుడు, ఎపిఎం బి.శివున్నాయుడు, మండల మహిళా అధ్యక్షురాలు పి.సుజాత, రైతు ఉత్పత్తిదారుల సంఘం సిసి వై.ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.పాచిపెంట : లింగ వివక్షకు వ్యతిరేకంగా పాచిపెంట మండల కేంద్రంలో వైకెపి, మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో శనివారం ఎంపిడిఒ కార్యాలయం వద్ద నుండి స్థానిక దళిత కాలనీ వరకు మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం జయ కుమార్, సిసిలు పాల్గొన్నారు.మక్కువ : మండల కేంద్రంలో లింగవివక్షకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సూర్యనారాయణ, ఎంపిడిఒ సిహెచ్ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.