మహాధర్నా విజయవంతానికి ప్రచారం

 ప్రజాశక్తి-సీతానగరం  :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 27, 28వ తేదీల్లో విజయవాడలో చేపట్టే మహాధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మథరావు కోరారు. శనివారం సీతానగరంలో మహాధర్నా విజయవంతానికి సిఐటియు మండల కార్యదర్శి గవర వెంకటరమణ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 500 రైతు సంఘాలకు నాయకత్వం వహిస్తున్న అఖిల భారత కిసాన్‌ సంయుక్త మోర్చా, అఖిలభారత కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు మహాధర్నా చేపడుతున్నట్లు వివరించారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు, అంగన్వాడీ వర్కర్స్‌, హోల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంట జ్యోతి, గ్రీన్‌ అంబాసిడర్‌ నాయుకులు జలుమూరు గౌరి, బి.అప్పారావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయుకులు రెడ్డి ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.బలిజిపేట : మహాధర్నాను విజయవంతం చేయాలని మండలంలోని అజ్జాడలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి యమ్మల మన్మథరావు మాట్లాడుతూ మహాధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.సాలూరు : మహాధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు పట్టణ నాయకులు టి.శంకరరావు కోరారు. మహాధర్నా కరపత్రాలను నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు టి.వెంకటరావు, భాస్కరరావు పాల్గొన్నారు.కొమరాడ : ఈ నెల 27, 28వ తేదీలలో విజయవాడలో నిర్వహించే మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.సాంబమూర్తి పిలుపునిచ్చారు. కూనేరు సంతలో మహా ధర్నాను జయప్రదం చేయాలని శనివారం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ప్రసాదు, బాబూరావు, రాజు, లక్ష్మణరావు, వెంకట్రావు, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️