ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్ : వెనుకబడిన కులాలకు రాజ్యాధికారం అందించిన మహౌన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని, సాంఘిక దురాచారాలను రూపుమాపిన మహనీయుడని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మంగళవారం స్థానిక వైఎస్‌ఆర్ మార్గ్ కూడలి వద్ద పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమక్షంలో జ్యోతిరావు పూలే 133వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక కార్యకర్త, కుల వ్యతిరేక సంఘ సంస్కర్త, రచయిత, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, మహిళలు, అణగారిన కులాల ప్రజలకు విద్యను అందించడంలో ఆయన చేసిన కృషితో మరువలేనివాన్నారు. భావి భారతదేశానికి ఒక గొప్ప సంస్కర్తగా నిలిచిన మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే అని, అతని భార్య సావిత్రీబాయి ఫూలే భారతదేశంలో స్త్రీల విద్యకు మార్గదర్శకులని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్లు, మూడు మండలాల, పట్టణ పార్టీ అధ్యక్షులు, జడ్పిటిసి సభ్యులు, ఎంపిపిలు, వైస్ ఎంపిపిలు, జెసిఎస్ కన్వీనర్లు, వైసిపి సీనియర్ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, స్టేట్ డైరెక్టర్లు, పిఎసిఎస్ చైర్మన్లు, ఎఎంసి డైరెక్టర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారధులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురం : జియమ్మవలస మండలం చినమేరంగి క్యాంప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, టిడ్కో ఛైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.పాలకొండ : మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సంద్భంగా వైసిపి నాయకులు పాలవలస రాజశేఖరం నివాసం వద్ద పట్టణ వైసిపి అధ్యక్షులు వెలమల మన్మధరావు అధ్వర్యంలో ఘనంగా నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పాలవలస ధవళేశ్వరరావు, కౌన్సిలర్లు కిలారి మోహనరావు, దుప్పాడ పాపినాయుడు, కె.విజరుకుమార్, దుంపల రమేష్, పీల అక్కలనాయుడు, నేరద బిల్లి ప్రసాద్, వప్పంగి చంద్ర మౌళి, కూనిబిల్లి సూరి తదితరులు పాల్గొన్నారు.వీరఘట్టం: మండలంలోని జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నడుకూరు, బొడ్లపాడులో జనసేన నాయకులు బిపి నాయుడు, ఎం.పుండరీకం, జనసేన జానీ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో కె.సాయి పవన్, చింత గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు. మక్కువ : సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఐద్వా నాయకులు వి.ఇందిర ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్లు అర్పించారు. స్థానిక ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు సమాజంలో జరుగుతున్న అనేక ర్యాగింగ్ల్. మత్తు పదార్థాలు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా ఎస్సై జి పైడ్రాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డి.మంజుల వాణి, అధ్యాపకులు ఎం.శ్రీనివాసరావు, ఎస్.మల్లేశ్వరి కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.పార్వతీపురంరూరల్ : పట్టణంలో మంగళవారం పలుచోట్ల మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించుగా, నియోజకవర్గ ఇన్చార్జి బోనెల విజయచంద్ర, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు వేర్వేరుగా తమ కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులర్పించారు.