ప్రజాశక్తి – కురుపాం: స్థానిక పోలీస్ స్టేషన్‌ను డిఎస్పి జివి కృష్ణారావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏడాది కాలంగా ఉన్న క్రైమ్ తదితర రికార్డులను పరిశీలించారు. అనంతరం సామాజిక సాధికారిక బస్సు యాత్ర జరుగు సభా స్థలాన్ని పరిశీలించి వాహనాల రాకపోకలకు ఇచ్చిన రూట్ మ్యాప్ గూర్చి అడిగి తెలుసుకొని ప్రయాణికులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బం దుల్లేకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎల్విన్‌పేట సిఐ సత్యనారాయణ, స్థానిక ఎస్సై సిహెచ్ ప్రసాద్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.