ప్రజాశక్తి – సాలూరు : బడుగు వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర చెప్పారు. మంగళవారం జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, సామాజిక కార్యకర్త జ్యోతిరావు పూలే ఆశయాలు, అడుగు జాడల్లోనే ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. దీనిలో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వంలో కీలకమైన పదవులు ఇచ్చిన సిఎం జగన్ మోహన్‌రెడ్డి సామాజిక సాధికారత దిశగా అడుగులు వేసినట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం హయాంలో లభించని విధంగా బడుగు వర్గాలకు గుర్తింపు లభించిందని రాజన్నదొర అన్నారు. కార్యక్రమంలో పట్టణ వైసిపి అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, జెసిఎస్ కన్వీనర్ గిరిరఘు, కౌన్సిలర్ లు రాపాక మాధవరావు, పప్పల లక్ష్మణరావు, గొర్లి వెంకటరమణ,జి.నాగేశ్వరరావు, డిసిఎంఎస్ డైరెక్టర్ పిరిడి రామకష్ణ, వైసిపి నాయకులు తాడ్డి రమణ పాల్గొన్నారు.