పాఠశాలల అభివృద్ధికి ప్రణాళికలు : డిఇఒ

గుమ్మలక్ష్మీపురం: పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి కల్పనకు ఉపాధ్యాయులు ప్రణాళికలు తయారు చేయాలని డిఇఒ ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ సూచించారు. స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఇఒ మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రధానమైన సమస్యలను ముందుగా గుర్తించి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇచ్చిన ప్రణాళిక నివేదికను ప్రభుత్వానికి పంపించి తద్వారా మంజూరైన పనులు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఇఒలు చంద్రశేఖర్‌, బడే జనార్దన్‌ నాయుడు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు పాలక దేవానంద్‌, సింహాచలం, సంజీవ్‌, సిఆర్పిలు పాల్గొన్నారు.ఇంగ్లీష్‌ సబ్జెక్టు పై మెలకువలు అవసరంస్థానిక జిల్లా ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న (లిప్‌) అభ్యాసన అభివృద్ధి కార్యక్రమాన్ని డిఇఒ పరిశీలించారు. ఇంగ్లీష్‌ సబ్జెక్టుపై జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆంగ్ల బోధనలో విద్యార్థులకు మెలుకువలు నేర్పించాలని సూచించారు. అప్పుడే ఆ సబ్జెక్టుపై ప్రతి విద్యార్థి పట్టు సాధించడానికి వీలుంటుందన్నారు. శిక్షణలో సమయపాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్‌ బిడ్డిక భీముడు, ఎంఇఒ చంద్రశేఖర్‌, రిసోర్స్‌ పర్సన్‌ కృష్ణమూర్తి ఉన్నారు.హడ్డుబంగి శిక్షణ కేంద్రం తనిఖీసీతంపేట : మండలంలోని హడ్డుబంగి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్‌ ఎల్‌ఐపి రెండో రోజు జరుగుతున్న శిక్షణ కేంద్రాన్ని డిఇఒ ప్రేమ్‌కుమార్‌ బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులను అన్ని సబ్జెక్టుల్లో వినుట, మాట్లాడుట, చదువుటం, రాయడం, తదితర సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణలో విని, నేర్చుకొని అమలు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలన్నారు. ఉత్తీర్ణతపై దృష్టి సారించాలన్నారు. డిఇఒ వెంట డిప్యూటీ డిఇఒ లిల్లీరాణి, ప్రధానోపాధ్యాయులు బి.ఉమావాణి, డిఆర్‌పిలు పాల్గొన్నారు.ఆదర్శ పాఠశాల ఆకస్మిక తనిఖీ భామిని : స్థానిక ఆదర్శ పాఠశాలను డిఇఒ ప్రేమ్‌ కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో గ్రంథాలయం, స్పోర్ట్స్‌ గది, తరగతి గదులు, విద్యార్థులు నోట్‌ పుస్తకాలు, తరగతి నిర్వహణ అంశాలు పరిశీలించి పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై విద్యార్థినిలను, ఉపాధ్యాయులను అడిగారు. మంచి ఫలితాలు సాధించేలా బోధన నిర్వహించి, విద్యార్థి అభివృద్ధికి పాఠశాలలు తోడ్పాడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఇఒ ఎస్‌.శ్రీనివాసరావు, ప్రిన్సిపల్‌ రఘు పాత్రుని శివకుమార్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

➡️