ప్రజాశక్తి – మక్కువ : మండలంలోని తూరు మామిడి పంచాయతీలో భూముల సర్వే కార్యక్రమం మంగళవారం జరిగింది. సుమారు 1279 ఎకరాలు ఉండగా ఇందులో 400 ఎకరాలకు పైబడి ప్రభుత్వం భూమి ఉంది. ప్రస్తుతం 60 ఎకరాల్లో ఈ సర్వే చేపట్టడం జరిగింది. రికార్డుల ప్రకారం పంచాయతీలో 35 చెరువులున్నాయి. ఈ సర్వే సందర్భంగా ప్రభుత్వ భూములు చెరువులకు సంబంధించి మరిన్ని సమగ్రమైన వివరాలు అందించడం జరుగుతుందని సర్వేయర్ జి.గణేష్ తెలిపారు. కార్యక్రమంలో విఆర్ఒ రూపవతి, స్థానిక సర్పంచ్ ఆర్.కృష్ణంనాయుడు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.