డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

బలిజిపేట: మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, పోస్టుమెట్రిక్‌ హాస్టలను నిర్మించాలని, జడ్పీహెచ్‌ పాఠశాలలో సంక్షేమ హాస్టల్‌ను వెంటనే ప్రారంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక జూనియర్‌ కళాశాలల విద్యార్థులతో ఆర్‌టిసి కాంప్లెక్స్‌ జంక్షన్‌ నుండి మెయిన్‌ రోడ్డు మీదుగా తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా నిర్వహించి, తహసీల్దార్‌ కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ మండలంలో వివిధ జూనియర్‌ కళాశాలల్లో సుమారుగా 500 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. అనేక ఏళ్ల నుంచి డిగ్రీ కళాశాల ప్రతిపాదన ఉన్నప్పటికీ స్థలం కేటాయించి, పనులు ప్రారంభించక పోవడం అన్యాయమని, పాలకుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని వాపోయారు. బలిజిపేటలో డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లలేక, పై చదువులకు తావు ేక ఇంటర్‌ తోనే నిలిచిపోయే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక దూర ప్రాంతాల గ్రామాలకు మండల కేంద్రం ముఖద్వారమని, ప్రభుత్వ విద్యా సంస్థలకు నిలయంగా నిలిచిన కేంద్రంలో పోస్టుమెట్రిక్‌ హాస్టలు లేకపోవడంత్లో రోజుల తరబడి ప్రయాణించేందుకు ఆర్ధికంగా ఇబ్బందులకు గురౌతున్నారని అన్నారు. కావున, బలిజిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పోస్టుమెట్రిక్‌ హాస్టల్‌ను ప్రారంభించాలని, అలాగే లిజడ్పీహెచ్‌ పాఠశాలలో సంక్షేమ హాస్టల్‌ భవనాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. వెంటనే నియోజకవర్గ, మండల ఈ సమస్యలపై ఈనెల 24 నుండి 29 వరకు నిరసన దీక్షలు, 30 న ఛలో కలెక్టరేట్‌ చేడుతున్నామని, ఈ లోపు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని, లేకుంటే పెద్ద ఎత్తున్న ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దానియల్‌, జూనియర్‌ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

➡️