ప్రజాశక్తి-చాగల్లు(తూర్పుగోదావరి) : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత చాగల్లు సచివాలయం- 4 పరిధిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా చాగల్లు మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను పరిశీలించి.. అక్కడ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి, విద్యా కానుక కార్యక్రమాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫ్యామిలీ ఫిజిషియన్ విధానాన్ని పరిశీలించారు. వైద్యం అందుకుంటున్న రోగుల వైద్య పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగన్నరేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. స్థానికుల నుంచి వచ్చిన మౌలిక వసతుల కల్పన, రోడ్లు, డ్రైన్ల సమస్యలపై సంబంధిత అధికారులను పిలిచి ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం చేస్తున్న అభివద్ధి, సంక్షేమ పథకాలను కుటుంబ సభ్యులకు వివరించారు. వారు పొందిన లబ్ధి వివరాలతో కూడిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను అందజేశారు. స్థానికులు రోడ్ల సమస్య డ్రైన్ఱేజ్ ఆమె దష్టికి తీసుకురాగా త్వరలో సమస్యలు పరిష్కరితమైన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నియోజవర్గ నాయకులు, మండల స్థాయి వైఎస్‌ఆర్ పార్టీ నాయకులు. మండలం స్థాయి అధికారులు, గ్రామసచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు