సీతంపేట: స్థానిక ఐటిడిఎ పిఒ కల్పనకుమారి ఉపాధ్యాయురాలిగా అవతారమెత్తి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బుధవారం మల్లి గురుకుల పాఠశాలను పిఒ పరిశీలించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వారికి గణితం, హిందీ, జాగ్రఫీ సబ్జెక్టులను బోధించారు. పాఠశాల అయిపోయిన తర్వాత అదనంగా నిర్వహించే స్టడీ అవర్లను విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. ఆ సమయంలో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. బోధనా సామర్ధ్యాల పెంపుపై పలు సూచనలు చేశారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచాలన్నారు. అదే విధంగా పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వాసుదేవరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.కుమ్మరిగండిని పరిశీలించిన పిఒమండలంలోని కుమ్మరిగండి గ్రామాన్ని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో పిఒ మాట్లాడారు. గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే పరీక్షలకు పుస్తకాలు ఇప్పించాలని కోరారు. గ్రామంలో నిర్మించిన అంగన్వాడీ భవనానికి బిల్లులు చెల్లించలేదని తెలిపారు. వారు తెలిపిన సమస్యలపై పిఒ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ గీతాంజలి, ఎపిఒ సాగర్, గృహ నిర్మాణశాఖ ఎఇ వెంకటేష్, ఎపిఎం, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గులుమురును సందర్శించారు. అంగన్‌వాడీ భవనం మంజూరు చేయాలన్నారు. నాడు-నేడు ద్వారా చేపడుతున్న భవనం పూర్తి చేయాలన్నారు. విడివికె ఏర్పాటుకు గ్రామస్తులు అవకాశం కల్పించాలన్నారు.