ప్రజాశక్తి – పార్వతీపురం : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఇవిఎం) పనితీరు ప్రదర్శన (డిమానిస్ట్రేషన్)ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రారంభించారు. ఇవిఎంలో ఓటు వేసి అది ఏ విధంగా నమోదైంది పరిశీలించారు. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఇవిఎం డిమానిస్ట్రేషన్‌ను ఏర్పాటు చేయడం జరుగుతోందనితెలిపారు. మొబైల్ ఇవిఎం డిమానిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇవిఎం డిమానిస్ట్రేషన్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఓటరు ఓటు వేసి టాన్ తనిఖీ చేసుకోవాలని ఆయన కోరారు. ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్, డిఆర్‌ఒ జె.వెంకటరావు, ఇతర అధికారులు తమ ఓటును వేసి పరిశీలించుకున్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయ పాలన అధికారి ఆర్ ఉమామహేశ్వర రావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.