బాలికకు సంపూర్ణ న్యాయం చేయాలి

మానవహారంలో పాల్గొన్న అఖిలపక్షం నాయకులు

మానవహారంలో పాల్గొన్న అఖిలపక్షం నాయకులు

 

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

ఎపిపి దంపతుల అఘాయిత్యానికి గురైన మైనర్‌ బాలికకు సంపూర్ణ న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని అఖిలపక్షం నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక సప్తగిరి సర్కిల్‌లో అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు భారీ మానవహారం నిర్మించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికపై అతి దుర్మార్గపు హింస జరిగి రోజులు గడుస్తున్నా సంపూర్ణ న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అరెస్టులకు మాత్రమే పరిమితం కాకుండా తక్షణమే దాష్టీకానికి పాల్పడిన ఏపీపీ దంపతులను పదవుల నుంచి తొలగించాలన్నారు. అలాగే బాలికకు కార్పొరేట్‌ వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి రామిరెడ్డి, ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, సిపిఎం నగర నాయకులు ప్రకాష్‌, వెంకటనారాయణ, ఆవాజ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వలి, ముష్కిన్‌, నాయకులు షర్మస్‌, ఫకృ, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ గౌస్‌మెహద్దీన్‌, కాంగ్రెస్‌నాయకులు ఇమామ్‌, టిడిపి నాయకులు ముక్తార్‌, ప్రజాసంఘం నాయకులు జాకీర్‌, జనసేన నాయకులు జయరామిరెడ్డి, అంకే ఈశ్వరయ్య, కాంగ్రెస్‌ నాయకులు ఎంఎండి.ఇమామ్‌, ప్రజాబలం నాయకులు నజీమ్‌ బాషా, ఎఐఎంఐఎం షేక్‌ దాదాపీరా, మెగా శ్యామ్‌, ఎస్‌ఎంఎండిఎస్‌ మసూద్‌, రఫీ, ప్రజాసంఘాల మహిళా నాయకురాలు శ్యామల, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు కిరణ్‌కుమార్‌, జయమ్మ, అవుకు విజరు కుమార్‌, నగర ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేష్‌, రొళ్ల భాస్కర్‌, హుస్సేన్‌, దరాజ్‌ బాషా, కెఎల్‌ఎస్‌.చోటు, లాల్‌స్వామి, కుమ్మర మురళి, అంజి, సంపత్‌, ఆకుల అశోక్‌, వీరమహిళలు అనసూయ, దాసరి సరిత, టిడిపి మహిళా నాయకురాలు, కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్‌, మరియు నాయకులు చిరు, సల్మాన్‌, విజరు దేవరయల్‌, నౌషాద్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️