వర్థంతి సభలో ఐద్వా జిల్లా కన్వీనర్ హైమావతి
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్
అమరజీవి తిప్పాని లక్ష్మీకాంతం ధన్యజీవి అని ఐద్వా జిల్లా కన్వీనర్ పి.హైమవతి అన్నారు. స్థానిక ఐద్వా కార్యాలయంలో లక్ష్మీకాంతం వర్థంతి సభ గురువారం నిర్వహించారు. ఈ సభలో హైమావతి మాట్లాడుతూ లక్ష్మీకాంతం ఐద్వా ఏలూరు పట్టణ అధ్యక్షులుగా పనిచేశారన్నారు. అప్పట్లో ఏలూరు పట్టణంలో వీధుల్లో మద్యం దుకాణాల నిర్వహణ, సినిమా థియేటర్లలో అశ్లీల చిత్రాల ప్రదర్శనలపై ఐద్వా జిల్లా ఉద్యమ నిర్మాత అయిన అల్లూరి మన్మోహని (అమ్మజి) నేతృత్వంలో ఉద్యమాలు నిర్వహించారని గుర్తు చేశారు. సిఐటియు నాయకులు పి.కిషోర్ మాట్లాడుతూ లక్ష్మీకాంతం పేరున పవర్పేటలో పేదలకు ఉపయోగపడేవిధంగా జనరిక్ మందుల షాపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు పట్టణంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై నాటి నుంచి నేటి వరకు ఐద్వా పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు సుకన్య, శారద, రాజ్యలక్ష్మి, శైదాని పాల్గొన్నారు.