బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన దోషులను శిక్షించాలి

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన అఖిలపక్షం నాయకులు

 

ప్రజాశక్తి-అనంతపురం

బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దంపతులను వెంటనే శిక్షించాలని అఖిలపక్ష, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు గురువారం జనసేన, టిడిపి, కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐతోపాటు పలు ప్రజాసంఘాల నాయకులు కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12ఏళ్ల బాలికపై అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దంపతులు క్రూరంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. సమాజం తలదించుకునే విధంగా దుశ్చర్యకు పాల్పడిన అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దంపతులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిఆర్‌ఒ గాయత్రి, డిఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఎం బాష, సిపిఎం నాయకులు రామిరెడ్డి, ప్రజాసంఘం నాయకులు జాకీర్‌, టిడిపి నాయకులు ముక్తార్‌, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు కిరణ్‌కుమార్‌, జయమ్మ, జిల్లా ఫోక్‌పర్సన్‌ జెఎం.బాషా, జనసేన నగర ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేష్‌, ధరాజ్‌ బాషా, నగర కార్యదర్శులు లాల్‌స్వామి, అంజి, సంపత్‌, ఆకుల అశోక్‌, కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్‌, టీడీపీ సిటీ మైనారిటీ ప్రెసిడెంట్‌ హజీజ్‌, కాంగ్రెస్‌ నాయకులు హిమాం, శర్మాస్‌, ఎంఐఎం యూత్‌ ఇన్‌ఛార్జి మసూద్‌వలి, ఆప్‌ యూత్‌ లీడర్‌ మసూద్‌వలి, యాంటీ కరప్షన్‌ ఆఫ్‌ ప్రెసిడెంట్‌ మహమ్మద్‌ షఫీ, హ్యూమన్‌ రైట్స్‌ మహిళా నాయకురాలు సరస్వతి, ముంతాజ్‌ బేగం, యాస్మిన్‌ భాను, జనసేన వీరమహిళలు అనసూయ, దాసరి సరిత, జనసేన నాయకులు చిరు, సల్మాన్‌, పెండ్లిమర్రి శ్రీన, విజరు దేవరయల్‌, నౌషాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️