ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): నెల్లూరు జిల్లా కావలికి చెందిన పొనుగోటి రాజేష్ కుమార్ తిరుపతి జాతీయ సంస్కత విశ్వ విద్యాలయంలో గణితశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ రమేష్ బాబు పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆఫ్ సంపెరిస్టాటిల్టిక్ ఫ్లోస్ త్రూ చానల్స్ విత్ పర్మిబుల్ వాల్స్’ అనే అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించినందుకు కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది. ప్రస్తుతం రాజేష్ కుమార్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో పరీక్షల నియంత్రణ అధికారిగా పనిచేస్తున్నారు. డాక్టరేట్ రావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుధాకర్ రెడ్డి రాజేష్ కుమార్ ను అభినందించారు.