పజాశక్తి – పుత్తూరు టౌన్ : మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని పుత్తూరు శాఖా గ్రంథాలయ అధికారి కె. మీనాకుమారి ఆధ్వర్యంలో ఆదివారం మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ స్కూలు ఎస్ఆర్ చెరువు ప్రధానోపా ధ్యాయురాలు శ్రీదేవి మాట్లాడుతూ ఇందిరా గాంధీ జీవిత విశేషాలను, ఆమె పట్టుదల, రాజకీయ జీవితం వంటి పలు విషయాలు చర్చించారు. ఇందిరా గాంధీ ఆమె తండ్రి జవహర్రాల్ నెహ్రూ జైలు నుండి రాసిన ఉత్తరాల ద్వారా ఉత్తేజితురాలై తనను తాను ఉన్నతంగా మలచుకున్నారని దేశ ప్రథమ మహిళా ప్రధానిగా అత్యున్నతంగా రాణించారన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని మహిళలు భవిష్యత్తును ఉన్న తంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. మహిళల రక్షణకు దిశ చట్టాన్ని యువతులు, మహి ళలు, ఆయుధంగా వినియోగిం చుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, మహిళా పాఠకు లు, గ్రంథాలయ సిబ్బంది ఎం సుజాత పాల్గొన్నారు.
గూడూరు టౌన్ : దేశ సేవలో ప్రాణాన్ని సైతం పోగొట్టుకున్న ఉక్కు మహిళ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోయాయని తిరుపతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. గూడూ రు కాంగ్రెస్ కార్యా లయంలో ఇంది రా గాంధీ జయం తిని నిర్వహించా రు. ఈ సంద ర్భంగా కాంగ్రెస్ నాయ కులు ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరా గాంధీ సేవలు వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో దర్శి నాగ భూషణం, చంద్రశేఖర్, నెహెమియా, తాజుద్దీన్, వేమయ్య పాల్గొన్నారు.
తిరుపతి(మంగళం): దేశ అభివద్ధి కోసం తన తండ్రి నెహ్రూ అడుగుజాడల్లో తిరుగులేని మహిళా నాయకు రాలిగా ఎదిగిన ఇందిరా గాంధీ ఒక వ్యక్తి కాదని ఒక శక్తి అని పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు అన్నారు. ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తమటం వెంకట నరసింహు లు ఆధ్వర్యంలో స్థానిక చెన్నారెడ్డి కాలనీలోని అంబేద్కర్ భవన్లో ఆదివారం ఘనంగా ఉత్సవాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సమావేశంలో తమటం వెంకట నరసింహులు మాట్లా డుతూ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని ఇందిరమ్మ బ్రిటిష్ వారితో పోరాడిన తీరును వివరించారు. చిన్నవయసులోనే దేశం కోసం ఆమె చేసి పోరాటం, త్యాగాలనే కాకుండా దేశ తొలి మహిళా ప్రధానిగా ప్రజా సంక్షేమం కోసం ఆమె చూపిన పాలన దక్షతను ప్రతి విద్యార్థి స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. పిసిసి ప్రధాన కార్యదర్శి గౌడపేర చిట్టిబాబు మాట్లాడుతూ ఇందిరా గాంధీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నన్నే ఖాన్, ఓబీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ బైలు గోపి, తిరుపతి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, తిరుపతి జిల్లా స్పోక్స్ పర్సన్ దూది రమేష్, ఎస్సీ సెల్ తిరుపతి అధ్యక్షుడు శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు చెంచయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు, నాయకులు ఏ రాజశేఖర్, శ్రీనివాసులు, నాగరాజు, కష్ణయ్య, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.