గుమ్మలక్ష్మీపురం : నిరుద్యోగులకు ఉపాధి కల్పన అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిందని స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. గుమ్మలక్ష్మీపురంలో రూ.20 లక్షల యూనిట్‌తో ఫిష్ ఆంధ్ర ప్రదేశ్‌ను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగులకు ఫిష్ ఆంధ్ర ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఫిష్ ఆంధ్ర నిర్వహణ ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నిర్వాహకులు యామాల తారకేశ్వరరావుకు సూచించారు. కార్యక్రమంలో ఎంపిపి కె దీనమయ్య, వైస్ ఎంపిపి నిమ్మక శేఖర్ , జడ్పిటిసి రాధిక, గుమ్మలక్ష్మీపురం సర్పంచ్ బి గౌరీ శంకర్ రావు వైసిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.