పెండింగ్ కేసులు పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయండి- పోలీసులకు ఎస్‌పి ఆదేశంప్రజాశక్తి -నాగలాపురం: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో వున్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని ఎస్‌పి పి. పరమేశ్వర రెడ్డి పోలీసులను ఆదేశిం చారు. వార్షిక తనిఖీలలో భాగంగా నాగలాపురం పోలీస్ స్టేషన్ ను ఎస్‌పి శుక్రవారం తనిఖీ చేసి ఎస్‌హెచ్‌ఓ, పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరును సమీక్షించి జనరల్ డైరీ, కేసు డైరీ, కోర్టు క్యాలెండర్ వంటి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ స్టేషన్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న కేసులను సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి బాధితులకి సరైన న్యాయం చేయాలని ఆదేశించారు. వేద నారాయణస్వామి ఆలయ దర్శనార్థం నిత్యం భక్తులు ఇక్కడికి వస్తుంటారని, హైవే రహదారులపై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యచరణ చేపట్టి, ప్రమాదకరమైన మలుపులు, రోడ్ క్రాసింగ్‌లను గుర్తించి అక్కడ సూచిక బోర్డులు, బారికేడ్లను, స్టాఫర్‌లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా అరికట్టి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. తరచూ రహదారులలో వాహనాల తనిఖీలను నిర్వహించి, ఎర్ర చందనం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికడుతూ నేరాలు జరగ కుండా నివారించాలన్నారు. నాటు సారా తయారీకి సంబం ధించిన గ్రామాలలో నిరంతరం ఆకస్మిక తనిఖీలు, కార్డెన్ అండ్ సెర్చ్, నాకాబంది నిర్వహించాలన్నారు. ఆపరేషన్ పరివర్తన కార్యక్రమాన్ని ఈ గ్రామాలలో విజయవంతంగా అమలు చేస్తూ పాత నేరస్తులకు, అనుమానితులకు కౌన్సెలింగ్ నిర్వహించి, ప్రభుత్వ పునరావాస సదుపాయాలు అందేలా చేయాలన్నారు. స్టేషన్ పరిధి లో ఉన్న కేడీలు, పాత నేరస్తులు, అనుమా నితుల కదలికలపై ప్రత్యేక మైన నిఘా ఉంచాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించకుండా అరి కట్టడానికి నిరంతరం గస్తీ కాసేందుకు బ్లూ కోల్ట్స్, బీట్ సిస్టంను బలోపేతం చేసి, మరింత సమర్థవంతంగా పనిచేసి నేర నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫిర్యాదులు స్వీకరించి చిన్న సమస్యగా ఉన్నప్పుడే ఇరు పక్షాలను పిలిపించి, వారితో మాట్లాడి వారిని రాజీ చేయిం చాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా సంరక్షణ కార్యదర్శుల పనితీరును సమీక్షించి మాట్లాడుతూ నేటి సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న ఈవ్ టీజింగ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, పోక్సో చట్టం వంటి విషయాల గురించి సంబంధిత విద్యా సంస్థలు, పారిశ్రామిక ప్రాంతాలలో అవగాహన కల్పించి చైతన్య వంతులను చేసి ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం వేద నారాయణ స్వామి ఆలయం, పల్లి కొండేశ్వర ఆలయాన్ని దర్శించు కున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు డిఎస్‌పి శ్రీనివాసరావు, సీఐ లు చంద్ర శేఖర్ పిళ్ళై, డిసిఆర్‌బి శివ కుమార్ రెడ్డి, సత్యవేడు సర్కిల్ ఎస్‌ఐ ఓబయ్య, నాగలాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.