జాతీయ పోటీలకు చిత్తూరు జిల్లా ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక ప్రజాశక్తి – క్యాంపస్ : చిత్తూరు జిల్లా ఆర్చరీ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ధనుంజయ ఆధ్వర్యంలో పలువులు క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మన్యం జిల్లా పార్వతీపురం లో మూడు రోజులపాటు జరిగిన 69వ రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలలో చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు రాష్ట్రస్థాయిలో స్వర్ణ ,రజిత,కాంస్య పతకాలను సాధించడమే చిత్తూరు జిల్లా టీం ఓవరాల్ ఛాంపియన్ గా గెలుపొందింది. తిరుపతికి చెందిన అంజన అండర్ 19 లో 30 మీటర్లు 50 మీటర్లలో స్వర్ణ పతకాలు సాధించగా, గోనుగుంట్ల యశశ్రీ అండర్ 19 లో 30 మీటర్లు 50 మీటర్లలో రజిత పతకాలను సాధించింది. స్నేహిత అండర్ 19 లో కాంస్య పతకం 30 మీటర్ల లో సాధించింది. అదేవిధంగా అండర్ 19 లో సుదర్శన్ శ్రీనివాస్ సిల్వర్ పతాకాన్ని సాధించగా సుజిత్ రెడ్డి కాంస్య పతకం సాధించారు. అండర్ 17 లో సాయి సుజల బంగారు పతాకాన్ని సాధించగా గీతిక కాంస్య పతాకాన్ని సాధించింది. అండర్ 14 విభాగంలో శ్రద్దానీ సిల్వర్ పతాకాన్ని వెండి పతాకాన్ని లోహిత కాంస్య పతకాన్ని సాధించగా, బాలురు విభాగంలో పథ్వి కాంస్య పతాకాన్ని, ధనుష్ కుమార్ బంగారు పతాకాన్ని సాధించారు. అటు ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా చిత్తూరు జిల్లా ఆర్చరీ టీం సాధించడం పట్ల కోచ్ ధనుంజయ హర్షం వ్యక్తం చేశారు. తమ కోచ్ ఆధ్వర్యంలో తాము తీసుకున్న శిక్షణ తమకు సత్ఫలితాలను ఇచ్చిందని భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా మంచి ఫలితాలు సాధిస్తామని ఆర్చరీ క్రీడాకారులు తెలిపారు.