అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Dec 1,2023 21:04

ప్రజాశక్తి – కాళ్ల
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే వైసిపి లక్ష్యమని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు అన్నారు. మండలంలోని కలవపూడిలో వై ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌.నరసింహరాజు మాట్లా డుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు. అర్హత ఉండి సాంకేతిక కారణాలతో పథకాలు అందకపోతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పథకాలను తెలిపే డిస్‌ప్లే బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శిరీష విశ్వనాధరాజు, జెడ్‌పిటిసి సభ్యులు సోమేశ్వరరావు, జిల్లా ఆక్వా సలహా మండలి సభ్యులు పి.దుర్గాప్రసాదరాజు, కలవపూడి సొసైటీ అధ్యక్షుడు బర్రె గంటయ్య, ఎంపిటిసి సభ్యులు నాగరాజు, వైసిసి మండల అధ్యక్షులు గణేశ్న రాంబాబు, తోటకూర చిన్నా పాల్గొన్నారు.

➡️