ప్రజాశక్తి – ఆచంట
బాల్య వివాహాల వల్ల అనర్ధాలు వస్తాయని ఐసిడిఎస్ సూపర్వైజర్ సూర్యకుమార్ అన్నారు. బేటి బచావో బేటి పడావో కార్యక్రమం వల్లూరు హైస్కూల్లో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వల్లూరు సెక్టార్ సూపర్వైజర్ సూర్యకుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాటా ్లడుతూ ఆడపిల్లలను పుట్టనిద్దాం, పెరగనిద్దాం, చదివిద్దాం నినాదంతో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వల్లూరు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీధరనరసింహమూర్తి, సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.