ఎయిడ్స్‌ నివారణపై అవగాహనా ర్యాలీ

Dec 1,2023 21:02

ప్రజాశక్తి – గణపవరం
ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గణపవరంలో కమ్యూనిటీ పారా మెడికల్‌ ప్రైమరీ హెల్త్‌ కేర్‌ యూనిట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పారా మెడికల్‌ ప్రైమరీ హెల్త్‌ కేర్‌ జిల్లా అధ్యక్షులు ఎఆర్‌కె.పరమేశ్వరులు మాట్లాడుతూ ప్రజలకు ఎయిడ్స్‌పై అవగాహన పెంచడం కోసం గ్రామంలో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యాధితో మరణించినవారి కుటుంబాల వారికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనిట్‌ మండల అధ్యక్షలు కె.సత్యనారాయణమూర్తి, కార్యదర్శి వి.శివశ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ప్రభాకర్‌, కోశాధికారి కె.అప్పారావు, పిహెచ్‌సి డాక్టర్‌ పి.సంతోషనాయుడు, సిహెచ్‌ఒ జాలాది విల్సన్‌బాబు, ఆరోగ్యసిబ్బంది పాల్గొన్నారు.పాలకొల్లు : పాలకొల్లు ఎఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాలు, రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వి.యామిని అధ్యక్షతన ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. దత్తత గ్రామాలైన యాళ్లవానిగరువు, అడవిపాలెంలో కూడా ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు ప్రజలకు ఎయిడ్స్‌పై ర్యాలీ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యాళ్లవానిగరువు, అడవిపాలెం సచివాలయాల సెక్రటరీలు, విఆర్‌ఒలు, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ ఎం.రామకృష్ణ, డాక్టర్‌ వి.విజయలక్ష్మి, రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌ కన్వీనర్‌ పి.జ్యోష్నశ్రీ, ఎన్‌ఎస్‌ఎస్‌ మెంబెర్స్‌ డి.మన్మధరావు, సిహెచ్‌.రవికుమార్‌, కె.పార్థసారథి, ఫిజికల్‌ డైరెక్టర్‌ జి.మహేష్‌ పాల్గొన్నారు.పాలకొల్లు రూరల్‌ : లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ అడ్డాల ప్రతాప్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఎం.నవ్యజీవన్‌, ఆరోగ్య విస్తరణాధికారి గుడాల హరిబాబు, పిహెచ్‌ఎన్‌ ఎలిజిబెత్‌, ఫార్మసిస్ట్‌ పివి.స్వామి, సూపర్‌వైజర్లు జి.ఉదయచందర్‌, ఎస్‌కె.అమలేశ్వరరావు, డి.కమల, కె.సతీష్‌, ల్యాబ్‌ టెక్నీషియన్లు పాల్గొన్నారు.ఆకివీడు : స్థానిక సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ వృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వ గీతి టైప్‌, ఫొటో స్టాట్‌ సంస్థ అధినేత డివిడి.కృష్ణారెడ్డి ఆర్థిక సహకారంతో ఎయిడ్స్‌ రోగులకు దుప్పట్లు, భోజనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు వృద్ధుల సంఘం అధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య అధ్యక్షత వహించారు. సిఐ కెవివి.సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచి చలంకూరు చలపతిరావు, బొబ్బిలి బంగారయ్య పాల్గొన్నారు. స్థానిక లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఆకివీడు ఆదర్శ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, పౌష్టికాహారం పంపిణీ చేశారు. తణుకు రూరల్‌ : తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని ఎఆర్‌టి సెంటర్‌లో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు ఒకటో అదనపు జిల్లా జడ్జి పివిఎన్‌.రంజిత్‌కుమార్‌, ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటిండెంట్‌ వి.అరుణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎఆర్‌టి సెంటర్‌ వైద్యాధికారి సుంకవల్లి రామకృష్ణ, ఎంఎల్‌ఎస్‌సి మెంబర్‌ ఎం.సుబ్బయ్య, సీనియర్‌ న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి పాల్గొన్నారు.నరసాపురం టౌన్‌ : నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్‌, ఇతర ప్రభుత్వ, ప్రయివేట్‌ కళాశా లల విద్యార్థులకు అవగా హన కార్యక్రమం నిర్వహించారు. ప్రభు త్వ ఆసుపత్రి నుంచి నరసాపురం బస్టాండ్‌ వరకు ర్యాలీ చేశారు. ఎంఎల్‌ఎ ముదునూరి ప్రసాద రాజు, ఎస్‌ఐ బిఎస్‌డిఆర్‌. ప్రసాద్‌, స్వర్ణాంధ్ర కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సురేష్‌ కుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్స్‌ వి.మాణిక్యా లరావు, ఎంవి.కృ ష్ణమోహన్‌, స్వర్ణాంధ్ర కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

➡️