ప్రజాశక్తి – సీతంపేట : ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. శుక్రవారం సీతంపేటలో ఇవిఎం యంత్రాల ద్వారా ఓటు ఎలా వేయ్యాలి అన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ ఇవిఎం యంత్రాల ద్వారా ఓటు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఇవిఎం యంత్రంలో ఓటు వేసిన అనంతరం మీరు వేసిన గుర్తుకే ఓటు నమోదయ్యేలా చూసుకోవచ్చన ా్నరు. ఈ సంధర్బంగా ప్రజలతో మాక్ పోలింగ్ నిర్వహించి అవగాహన కల్పించారు. సీతంపేటలో ప్రతిరోజు ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీన్ని ప్రజలంతా వినియోగించుకోవాలన్నారు. అనంతరం మండలంలోని గ్రామాల్లోకి వెళ్లి అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని పిఒ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ గీతాంజలి, తహశీల్దార్ నరసింహమూర్తి, డిటి కుమారి, ఇతర రెవెన్యూ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.పాలకొండ: 18ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా విధిగా నమోదు కావాలని కళాశాల ప్రిన్సిపల్ పైల శంకర్రావు తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు)లో ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఇంగ్లీష్ అధ్యాపకులు ధవళ నారాయణరావు పర్యవేక్షణలో 18ఏళ్లు నిండిన సుమారు 52 మంది విద్యార్థులు తమ ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తులు పూర్తి చేశారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా ఓటరుగా నమోదు కావాలని, అలాగే ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు తేజేశ్వరరావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి వెలమల అప్పారావు, పౌర శాస్త్ర అధ్యాపకులు వెంకటేశ్వర్, చరిత్ర అధ్యాపకులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : ఈనెల 2, 3 తేదీల్లో ఓటర్ల నమోదు, తనిఖీ కోసం కేటాయించిన బిఎల్‌ఒలు వారి పోలింగ్ కేంద్రాల్లో యూనిఫాం, ఐడి కార్డులను కలిగి ఉండాలని పాలకొండ ఆర్‌డిఒ ఎం.లావణ్య తెలిపారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయ సమావేశ మందిరంలో బిఎల్‌ఒలు, సూపర్వైజర్లతో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ప్రతి పోలింగ్ కేంద్రాల గోడలపై సంబంధిత బిఎల్వోల పేర్లను రాసి ఉంచాలని అన్నారు. త్వరలో ప్రతి మండలానికి ఓటర్లను చైతన్యపరిచేందుకు మొబైల్ ఇవిఎం వ్యాన్లు రానున్నాయని, అందుకుగాను ప్రజలకు ముందస్తుగా తెలియపరచాలని అన్నారు. అలాగే సూపర్వైజర్లకు కేటాయించిన విధులను ఎప్పటికప్పుడు పైఅధికారులకు తెలియపర్చాల న్నారు. సమావేశంలో మండల తహశీల్దార్ జె.రాములమ్మ, డిప్యూటీ తహశీల్దార్ ఎం.రాజేంద్ర, ఇఒపిఆర్‌డి జగదీష్ కుమార్, ఎంఇఒ- 2 జనార్దన్ నాయుడు, పిఆర్ ఎఇ మురళీధర్ రావు తదితరులు ఉన్నారు.ఇవిఎంలపై బూత్ స్థాయిలో ఓటర్లకు అవగాహన పార్వతీపురంరూరల్ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై బూత్ స్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు ఆర్‌డిఒ కె.హేమలత తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో పట్టణ ప్రాంత ప్రజలకు ప్రతిరోజు ఇవిఎంలపై అవగాహన కల్పిస్తామని, గ్రామాల్లో ఎండివి వాహనంతో ఇవిఎంలపై అవగాహన కార్యక్రమం చేపడతామని, నియోజకవర్గంలో 232 పోలింగ్ కేంద్రాల్లో షెడ్యూల్ ప్రకారం బిఎల్‌ఒలు, ఇతర సిబ్బంది ప్రతిరోజు దీనిపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 7 వరకు అవగాహన కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. ఓటర్లు, రాజకీయ నాయకులు ఈ అవగాహన కార్యక్రమాల్ని స్వదినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్ శివన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.జనసేన ఆధ్వర్యాన ఓటరు నమోదుబలిజిపేట : స్థానిక బస్ స్టేషన్ పరిధిలో జనసేన ఆధ్వర్యంలో కొత్తగా ఓటరు నమోదు కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు. ఈ సంధర్బంగా జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి యువకుడు తప్పని సరిగా ఓటు హక్కును వినియో గించుకోవాలని కోరారు. కారక్రమంలో నాయకులు స్వామి నాయుడు, రమణ, తదితరులు పాల్గొన్నారు.