ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా) : మల్లేశ్వరం పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్.వి.ఆర్ స్పిన్నింగ్ మిల్ ప్రక్కన 33/11 కె.వి సబ్ స్టేషన్ స్థానిక ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి పక్కన ఉన్న 1/2 ఎకరం భూమి దాత-వంక రాజకుమారి ఇచ్చారన్నారు. 3.54 కోట్ల రూపాయలతో మంజూరు చేయించిన సబ్ స్టేషన్ పూర్తయిన వెంటనే సుమారు 240 అగ్రికల్చరల్ సంబంధించిన కనెక్షన్లు 4000 ఇళ్ల కనెక్షన్లు ఇస్తారని తెలిపారు స్టేషన్ పరిధిలో ఏడు గ్రామాలు మల్లేశ్వరం పిట్టలవేమవరం ముక్కామల అన్నవరప్పాడు కడింపాడు ఖండవల్లి తదితర గ్రామాలకు మెరుగైన విద్యుత్ సదుపాయం కల్పించబడుతుందన్నారు.
వినియోగదారులకు, రైతులకు లో వోల్టేజ్ సమస్య తీరుతుందన్నారు. సబ్ స్టేషన్ వర్క్ జనవరి నెలాఖరులోపు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొలిశెట్టి రత్నమాల ఎంపీటీసీ కోటిపల్లి దేవిక రాణి మాజీ ఎంపీపీ కోటిపల్లి మురళీకృష్ణ ఉప సర్పంచ్ బొలిశెట్టి పట్టాభి రామారావు ఎండి. వంక రాజకుమారి జె.యం.డి వంక రఘువీర్ రవళి. ఎంపీపీ కె.సీతారాం ప్రసాద్ వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు వీరమల్లు సత్యనారాయణ రామడుగుల సూర్యనారాయణ (పంతులు) పాల వెంకటేశ్వర రావు ఎలక్ట్రికల్ ఏ డి పి.శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.వీరభద్రరావు ఎలక్ట్రికల్ ఏఈ డేవిడ్ నిచ్చల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.