ప్రజాశక్తి – కురుపాం: చంద్రబాబునాయుడుతోనే గిరిజన, బడుగు బలహీన వర్గాలకు భవిష్యతుఉంటుందని కురుపాం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి టి.జగదీశ్వరి అన్నారు. మండలంలో గుజ్జువాయి పంచాయతీలో గల పలు గిరిజన గ్రామాల్లో గురువారం బాబు, షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి టిడిపి అధికారంలోకి వస్తే తీసుకొస్తున్న పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా టిడిపికి ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ హెచ్.సుబ్బలక్ష్మి, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సీతంపేట : మండలంలోని కొతాంలో పాలకొండ నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జయకృష్ణ మాట్లాడుతూ మినీ మేనిఫేస్టోలోని సూపర్ సిక్స్ అంశాలను వివరిస్తూ ఖచ్చితంగా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం క్లస్టర్ ఇంచార్జ్ నిమ్మక చంద్రశేఖర్, భవిష్యత్తు గ్యారెంటీ ప్రచారకర్త తోయిక సంధ్యారాణి, రామారావు, సవర నాయుడు,సవర గంగయ్య, సవర రవి, సవర శ్రీను, సవర సుందర రావు,గ్రామపెద్దలు మహిళలు ముఖ్యలు పాల్గొన్నారు.