మెప్మా స్టాల్స్‌ను ప్రారంభిస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్
ప్రజాశక్తి-కళ్యాణదుర్గం
రాష్ట్రంలోని ప్రతి మహిళా తమ స్వశక్తితో ఎదిగి ఆదర్శంగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యమని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. బుధవారం పట్టణంలోని టీసర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన మెప్మా అర్బన్ మార్కెట్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయూత, ఆసరాతోపాటు సున్నావడ్డీ రుణాలు తీసుకున్న పొదుపు సంఘాల మహిళలు స్వయం ఉపాధి కల్పించేలా అర్బన్ మార్కెట్లను అందుబాటులోకి తీసుసుకొచ్చినట్లు తెలిపారు. అనంతరం మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాల్స్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు, వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.