కొనసాగిన రిలే నిరాహార దీక్ష

రిలే నిరాహార దీక్షలో మాట్లాడుతున్న మండల కార్యదర్శి చెన్నారెడ్డి

ప్రజాశక్తి-గార్లదిన్నె

సిపిఎం ఆధ్వర్యంలో మండలంలోని తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి చెన్నారెడ్డి మాట్లాడుతూ మండల పరిధిలోని కోటంక గ్రామంలో దళితులు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలు సర్వే నెంబర్‌ 243 -1 సాగు చేసుకున్న భూమికి పట్టాలు ఇవ్వాలని, కల్లూరు గ్రామంలో ప్రభుత్వం కూల్చేసిన స్థలంలోనే 137 మంది పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని, పెనకచర్ల గ్రామంలో సర్వేనెంబర్‌ 527లో దళితులు, గిరిజనులు సాగు చేసుకున్న భూమికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పేదలకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. అధికారులు దిగివచ్చి పేదలకు సత్వర న్యాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, నాగమ్మ, రాయుడు, తదితరులు పాల్గొన్నారు.

➡️