ప్రజాశక్తి – పార్వతీపురం : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టరు నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పురోభివృద్దిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టరు మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రాధాన్యతా భవనాలు, జలజీవన్ మిషన్, హౌసింగు, గడపగడపకు మన ప్రభుత్వం పథకాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించిందని, లక్ష్యాలను అధికారులు గడువులోగా పూర్తిచేయాలని తెలిపారు. ప్రాధాన్యతా భవనాలను లక్ష్యం మేరకు పూర్తిచేయక పోవడంపై జిల్లా కలెక్టరు అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తిచేసిన పనులకు చెల్లింపులు చేస్తున్నప్పటికీ, భవన నిర్మాణాలు లక్ష్యాలు చేరుకోవడం లేదని, నిర్మాణాలు పూర్తిచేసి బిల్లుల చెల్లింపుల కోసం పంపించాలని, భవనాలు సంబంధిత శాఖలకు అప్పగించనం తకాలం బిల్లులు పెండింగు ఉంటాయని, కావున భవనాలను పూర్తిచేసి బిల్లులను వెంటనే అప్లోడ్ చేయాలని తెలిపారు. జల జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీరందించి, ఆ కుటుంబాల్లో ఆనందాన్ని కల్పించాలని సూచించారు. ఈ పథకం కింద లక్ష్యంమేరకు 50 వేల కుళాయి కనక్షన్లు వెంటనే పూర్తిచేయాలని తెలిపారు. విద్యాశాఖకు సంబంధించి టెన్త్లో మంచి ఫలితాలు సాధించేందుకుగాను రూపొందిం చిన ప్రణాళిక ప్రకారం అధికారులు వారికి కేటాయించిన పాఠశాలలకు వారంలో రెండురోజులు పర్యటించాలన్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల విద్యాప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయని, అటువంటి వారిని గుర్తించి, వారిపట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఉన్నతాధికారులు పాఠశాలలకు పర్యటించడం ద్వారా విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకొని మంచి భవిష్యత్తు పొందేందుకు, వారిలా ఉన్నత స్థానాలకు చేరాలనే ఆశయం కలిగి చదువుపట్ల శ్రద్ద కనబరుస్తారని తెలిపారు. కావున విద్యార్థు లకు మంచి మార్కులతో పాటు, నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవా లని తెలిపారు. రెండో విడత మెగా హౌసింగు డ్రెవ్లో భాగంగా ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో 5లక్షల గృహ నిర్మాణం పూర్తిచేసే కార్యక్రమం లో భాగంగా జిల్లాకు 10264 ఇళ్లు లక్ష్యంగా కేటాయించారని, సచివాలయం వారీగా ఇంజనీరింగు అసిస్టెంట్లకు లక్ష్యం కేటాయించామని, లక్ష్యాలు పూర్తి చేసేందుకు మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఒలు, హౌసింగు, విద్యుత్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని పూర్తిచేయాలని తెలిపారు. రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా తయారీ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని, వచ్చే నెలలో రోల్ అబ్జర్వర్ పర్యటన ఉంటుందని, సవరణకు సంబంధించి ఫారం-7 తిరస్కరించేటప్పుడు తప్పని సరిగా కారణాన్ని పొందుపర్చాలని తెలిపారు. సవరణకు సంబంధించి ఫారాలను గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. కళాశాలలలో 18 ఏళ్లు దాటిన వారినందర్నీ ఓటర్లుగా చేర్చాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన పిదప ప్రతి దశ కీలమేనని, బ్యాలెట్ ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ పింపిణీ, నామినేషన్లు స్వీకరణ, పోలింగు ప్రక్రియలో ఎటువంటి అనుమానాలకు తావులేకుండా ముందు నుండి పూర్తి అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అవార్డుకు సిఫార్సు చేయండిగర్బిణీలు, బాలింతలు, బాలికలలో రక్తహీనత నివారణకు సంబంధించి రూపొందించిన ప్రణాళిక అమలు గూర్చి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గర్బిణీలను రక్తహీనత నుండి కాపాడడంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకు సీతానగరం మండలం బూర్జ సచివాలయం వెల్పేర్ అసిస్టెంటు పి.రోహణిని గణతంత్ర దినోత్సవానికి అవార్డుకు సిఫార్సు చేయాల్సిందిగా ఎంపిడిఒ కృష్ణమహేష్ రెడ్డిని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో జాయింటు కలెక్టరు ఆర్.గోవిందరావు, డిఆర్ఒ జె.వెంకటరావు, పంచాయతీరాజ్ ఇఇ ఎంవిఆర్ కృష్ణాజీ, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, జిల్లాఆర్డబ్ల్యుఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, డిపిఒ బి.సత్యనారాయణ, డిఇఒ ఎన్.ప్రేమ్ కుమార్, డిఆర్డిఒ పీడీ కిరణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.