భూగర్భ గనిలో ప్రమాదం 

భూగర్భ గనిలో ప్రమాదం 

.ప్రమాద విషయంపై స్థానికులతో మాట్లాడుతున్న పోలీసులు

    పెద్దవడుగూరు : అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కొండుపల్లి గ్రామ సమీపంలోని భూగర్భగనిలో ఉన్న డోలమైట్‌ను వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన జిలిటిన్‌స్టిక్స్‌ పేలి ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మరణించాడు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… కోనాపురం, రావులుడికి చెందిన కొందరు కూలీలు కొండుపల్లి వద్ద ఉన్న రాజపుల్లయ్య మినరల్స్‌ భూగర్భ డోలమైట్‌ గనిలో పనిచేసేందుకు వెళ్తుంటారు. ఆదివారం నాడు రాయిపెకలింపు కోసం రోజువారి పేలుడు సామగ్రి(ఘాతాలు) సుమారు 15చోట్ల పెట్టి పేల్చారు. వీటిలో 13 పేలాయి. మిగిలిన రెండు పేలలేదు. పేలని ఈ రెండింటినీ గమనించేందుకు కంబగిరిస్వామి(38), రాజ్‌కుమార్‌ మరో ముగ్గురు కార్మికులు ఆ ప్రాంతం వద్దకు వెళ్లారు. వీరిద్దరూ పరిశీస్తున్న తరుణంలో ఒక్కసారిగి పేలుడు సంభవించింది. దీంతో కంబగిరిస్వామి అక్కడికక్కడే మతిచెందాడు. రాజ్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. మరోముగ్గురికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. వెంటనే తోటి కార్మికులు స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి డీఎస్పీ సిఎం.గంగయ్య, సిఐ శంకరరెడ్డి, యాడికి ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరాతీశారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

➡️