ప్రజాశక్తి – సీతంపేట : మండలంలోని మానాపురం పంచాయతీలో టిడిపి నాయకులు పడాల భూదేవి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించి, మహాశక్తి పథకాల గురించి ఇంటింటికి కరపత్రాలతో ప్రచారం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి సవర కుంపి, సవర చిన్నారావు, సవర మల్లేష్, సవర సిమ్మయ్య, మాజీ ఎంపిటిసి సభ్యులు బిడ్డిక జయలక్మి, సవర బాలరాజు, తాలాడ, సీనియర్ నాయకులు సవర మంగయ్య, సవర బంగారయ్య, సవర గంగయ్య, మాజీసర్పంచ్ కోతాం, సవర బాలరాజు, తదితరులు, పాల్గొన్నారు.
కురుపాం : మండలంలోని నీలకంఠపురం, ఊసకొండ పంచాయతీల్లో గల దండుసూర, జబ్బమానుగూడ, గంగన్నదొరవలస గిరిజన గ్రామాల్లో టిడిపి మండల కన్వీనర్ కెవి కొండయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జి టి.జగదీశ్వరి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు మేనిఫేస్టోలో పెట్టిన బాబు షూరిటీ కార్యక్రమాల గూర్చి ఇంటింటికి వెళ్లి వివరించి ప్రజల భవిష్యత్తుకి భరోసా ఇచ్చే ఏకైక నాయకుడు చంద్రబాబు అని అన్నారు. కావున రానున్న ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి భవానీ, అరుకు పార్లమెంట్ ఎస్టి సెల్ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు, మండల ప్రధాన కార్యదర్శి శంకర్, టిడిపి నాయకులు ప్రదీప్,రామారావు, కార్యకర్తలు పాల్గొన్నారు.