ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం: వట్టిగెడ్డ రిజర్వాయర్‌కు తూతూమంత్రంగానే మరమ్మతులు పనులు చేపట్టారని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు ఆరోపించారు. శనివారం జనసేన నాయకులతో కలిసి జియ్యమ్మవలస మండల పరిధిలోని రావాడ వట్టిగెడ్డ రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్ అభివృద్ధికి జైకా నిధులు సుమారుగా రూ.44 కోట్లు మంజూరయ్యాయని, అందులో రూ.7 కోట్లతో మరమ్మతులు చేశామని స్థానిక ఎమ్మెల్యే చెప్పుకుంటున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో పనులు కాకపోవడం వల్ల వట్టిగెడ్డ రిజర్వాయర్ ఆయకట్టు రైతులకు సరైన సమయానికి నీరందలేదన్నారు. ఎడమ కాలువ పూడికతీత పనులను రైతులు సొంత డబ్బులతో చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే పనులు పునఃప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు వారణాశి శివకుమార్, కార్యదర్శి నేరేడుబిల్లి వంశీ, నాయకులు పెంట శంకరరావు, ఎల్.రంజిత్‌కుమార్, వి.రాజేష్ , గంటేడ భార్గవ పాల్గొన్నారు.