రాజోలు : సోమవారం నుంచి పున:ప్రారంభం కానున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిన నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లారాజోలు మండలం పొదలాడ నుంచి సోమవారం పాదయాత్ర పున్ణప్రారంభం కానుంది. ఇందుకోసం నారా లోకేశ్ ఆదివారం సాయంత్రమే అక్కడికి చేరుకోనున్నారు. ఈ యాత్రంలో టీడీపీ, జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గననున్నారు. మొదటి రోజు పాదయాత్ర 15 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సెప్టెంబర్ 9న పాదయాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే. తిరిగి దాదాపు రెండున్నర నెలల తర్వాత ఈ యాత్ర పున:ప్రారంభం కాబోతోంది.